ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారీ..గ్రామాలే టార్గెట్

ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారీ..గ్రామాలే టార్గెట్

రంగారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. కాటేదాన్ ఐస్ క్రీమ్ పరిశ్రమపై పోలీసులు దాడులు నిర్వహించారు.  ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.  ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు. 

ఆకర్షణీయమైన లేబుల్స్ అతికించి కల్తీ ఐస్ క్రీమ్ ను మార్కెట్ లో విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. కల్తీ ఐస్ క్రీమ్ లు విక్రయిస్తూ చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ట్రీడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ వంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా పరిశ్రమలు నిర్వహిస్తున్నారని తెలిపారు.  గ్రామీణ ప్రాంతాలే టార్గెట్ గా ఐస్ క్రీమ్ లు తయారు చేస్తూ సోమ్ము చేసుకుంటున్నారని..జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.