
భారత్ తో ఆఫ్ఘనిస్తాన్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్భూభూగాన్ని ఏ దేశానికి అనుకూలంగా ఉపయోగించబోమని ప్రకటించింది. శుక్రవారం ( అక్టోబర్ 10) ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ లో విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి సమావేశం అయ్యారు. కాబూల్ తన భూభాగాన్ని ఏ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి అనుమతించదు అని ముత్తాకి హామి ఇచ్చారు.
రెండు దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు చర్చలు జరిపారు. వాణిజ్యం, అభివృద్ధి, భద్రతలో సహకారానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.
ఆఫ్ఘనిస్తాన్ లో అభివృద్ధి ప్రాజెక్టులను కొనసాగిస్తామని భారత్ ప్రకటించడంతో తాలిబన్ మంత్రి స్వాగతించారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపాలు, వరదల సమయంలో భారత్ అందించిన సాయం, మద్దతుకు తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి కృతజ్ణతలు తెలిపారు.
2021లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నిలిచిపోయిన ఆర్థిక సంబంధాలను పునరుద్దరించేందుకు ద్వైపాక్షిక వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ఉమ్మడి వాణిజ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
►ALSO READ | Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి.. ట్రంప్ కు నిరాశే
గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్‌లో రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ,పార్లమెంట్ భవనంతో సహా వివిధ పునర్నిర్మాణ ప్రాజెక్టులలో భారత్ 3 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది.
సరిహద్దు విషయంలో పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముత్తాకి. పాకిస్తాన్ విధానం సమస్యలను పరిష్కరించలేదు. ఆఫ్ఘన్ ప్రజల సహనం, ధైర్యాన్ని పాకిస్తాన్సవాల్ చేస్తుందన్నారు.