Cricket World Cup 2023: వీళ్ళ ఆనందం మాములుగా లేదే: బస్సులో లుంగీ డాన్స్ వేసిన ఆఫ్ఘనిస్తాన్ టీం

Cricket World Cup 2023: వీళ్ళ ఆనందం మాములుగా లేదే: బస్సులో లుంగీ డాన్స్ వేసిన ఆఫ్ఘనిస్తాన్ టీం

వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాలను నమోదు చేస్తుంది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ కి షాకిచ్చిన ఆఫ్ఘన్..  తమ విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ పాకిస్థాన్ పై నిన్న( అక్టోబర్ 23)  విజయాన్ని సాధించి సంచలనం సృష్టించింది. పాక్ పై ఆడిన చివరి ఏడు మ్యాచుల్లో ఓడిపోయిన ఆఫ్ఘన్..ఎట్టలకే తొలి విజయాన్ని రుచి చూసింది. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సంబరాలు అంబరాన్ని అంటాయి.

చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో అఫ్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అయితే ఇర్ఫాన్ పఠాన్‍‌తో కలిసి గ్రౌండ్లోనే స్టెప్పులు వేశాడు. అయితే ఈ సంబరాలు కొనసాగిస్తూ బస్ లో కూడా చిందేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, దీపికా పడుకునే జంటగా నటించిన  చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో లుంగీ డ్యాన్స్ కు స్టెప్పులు ఇరగదీసారు. లుంగీ డ్యాన్స్ పాటకు అఫ్ఘానిస్తాన్ ప్లేయర్స్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

షారుక్ పాటకు ఫుల్ జోష్‌లో గెంతులేస్తూ కనిపించిన అఫ్ఘానిస్తాన్ ప్లేయర్స్.. తగ ఎంజాయ్ చేశారు. ఇక మైదానంలో  స్టెప్పులేసిన రషీద్ ఖాన్ బస్సులో కూడా తన తగ్గలేదు. లుంగీ డ్యాన్స్ పాటకు చిందులేస్తూ.. సహచర ప్లేయర్లలో జోష్ నింపాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో ఆడిన ఐదు మ్యాచుల్లో మూడు విజయాలను సొంతం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్.. సెమీస్ ఆశలను ఇంకా అలాగే ఉంచుకుంది. బంగ్లాదేశ్, భారత్, న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన ఆఫ్ఘన్.. ఇంగ్లాండ్, పాకిస్థాన్ పై విజయాలు సాధించింది.