ముంబై ఇండియన్స్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ముజీబ్‌‌‌‌‌‌‌‌

ముంబై ఇండియన్స్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ముజీబ్‌‌‌‌‌‌‌‌

ముంబై: అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్ ఈ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో  ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరఫున బరిలోకి దిగనున్నాడు. గాయం కారణం లీగ్ నుంచి తప్పుకున్న అఫ్గాన్‌‌‌‌‌‌‌‌కే చెందిన అల్లా ఘజాన్‌‌‌‌‌‌‌‌ఫర్ స్థానంలో ముజీబ్ ను తమ జట్టులోకి తీసుకున్నట్లు ముంబై ఆదివారం ప్రకటించింది. 

18 ఏండ్ల ఘజాన్‌‌‌‌‌‌‌‌ఫర్ వెన్ను గాయం కారణంగా లీగ్‌‌‌‌‌‌‌‌తో పాటు రాబోయే చాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. వేలంలో ముంబై అతడిని రూ.4.80 కోట్లకు కొనుగోలు చేసింది.