కోహ్లీ vs నవీన్ ఉల్ హక్: ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ కప్ జట్టు ఇదే

కోహ్లీ vs నవీన్ ఉల్ హక్: ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ కప్ జట్టు ఇదే

భారత్ వేదికగా వచ్చే నెలలో వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని జట్లు తమ వరల్డ్ కప్ స్క్వాడ్ లను ఎంపిక చేయగా తాజాగా  ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు  ప్రపంచ కప్ 2023 కోసం 15 మంది సభ్యుల ప్రాబబుల్స్ ని ప్రకటించింది. ఆసియా కప్ కి ఎంపికవ్వని నవీన్ ఉల్ హాక్ వరల్డ్ కప్ లో స్థానం సంపాదించాడు. హష్మతుల్లా షాహిదీ ఆఫ్ఘానిస్తాన్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.  

కోహ్లీ వర్సస్ నవీన్ 

ఈ ఏడాది ఐపీఎల్ లో భాగంగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ పేస్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మధ్య పెద్ద గొడవైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీ లాంటి ప్లేయర్ పై నోరు పారేసుకున్నందుకు ఇండియన్ ఫ్యాన్స్ ఈ అఫ్గాన్ బౌలర్ ని టార్గెట్ చేశారు. ఇటీవలే నవీన్ ఆసియా కప్ లో సెలక్ట్ అవ్వకపోయేసరికి వరల్డ్ కప్ కి కూడా ఎంపికవ్వడం అనుమానంగా మారింది. కానీ అనూహ్యంగా వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఫాస్ట్ బౌలర్ మీద ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. వచ్చే నెల 11 న భారత్ తో ఆఫ్ఘానిస్తాన్ జట్టు తలపడనుంది.  

Also read :- నేనేం చేయలేదు.. ఆ క్రెడిట్ అంతా అతనికే దక్కాలి: కేఎల్ రాహుల్

ఇక జట్టు విషయానికి వస్తే ఆఫ్ఘానిస్తాన్ జట్టుకి స్పిన్ ప్రధాన బలం. ప్రపంచ స్థాయి స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజీబ్, నబీ ఆ జట్టులో ఉండగా యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ తన స్పిన్ మ్యాజిక్ ని చూపేందుకు సిద్ధంగా ఉన్నాడు. బ్యాటింగ్ లో గర్భాజ్, ఇబ్రహీం జద్రాన్, షాహిది పైనే భారం పడనుంది.