36 ఏళ్ల తరువాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్

36  ఏళ్ల తరువాత కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ అనగానే ‘నాయకుడు’ సినిమా గుర్తొస్తుంది. ముప్ఫై ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాను  ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేరు. ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. కమల్ నటిస్తున్న 234వ సినిమా ఇది. శుక్రవారం ఈ చిత్రాన్ని గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ‘బిగిన్ ది బిగిన్’ అనే ప్రోమోలో కమల్ హాసన్, ప్రదీప్ శక్తి మధ్య నాయకన్ ఐకానిక్ సీక్వెన్స్ చూపించారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సమర్పణలో కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్‌‌‌‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.