బ్యాంకులో కొట్టేసిన డబ్బు బయట చల్లేసిండు

బ్యాంకులో కొట్టేసిన డబ్బు బయట చల్లేసిండు

క్రిస్మస్‌‌ గ్రీటింగ్స్‌‌ చెప్పిన దొంగ అది క్రిస్మస్‌‌కు రెండ్రోజుల ముందు. తెల్లగడ్డంతో ఉన్న ముసలి వ్యక్తి ఓ బ్యాంకులోకెళ్లాడు. వేలాది డాలర్లు కొట్టేశాడు. బ్యాగులో సర్దుకున్నాడు. రోడ్డుమీదికొచ్చాడు. ఇంకేముంది..‘ఉరుకుడే’ అనుకుంటున్నారా.. కాదు. మనోడు కాస్త వెరైటీ దొంగ. బ్యాగులోంచి డబ్బులు తీసి చల్లుకుంటూ వెళ్తూ కనబడినోళ్లందరికీ క్రిస్మస్‌‌ గ్రీటింగ్స్‌‌ చెప్పాడు. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో జరిగిందీ సంఘటన. డేవిడ్‌‌ వానే ఒలివర్‌ (65) కొలరాడోలోని అకాడమీ బ్యాంకులోకి సోమవారం మధ్యాహ్నం జొరబడ్డాడు. వెపన్‌‌తో సిబ్బందిని బెదిరించాడు. పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేశాడు. బయటకొచ్చి ఆ డబ్బును రోడ్డుపై చల్లుకుంటూ వెళ్తూ కనబడిన వాళ్లందరికీ మెర్రీ క్రిస్మస్‌‌ గ్రీటింగ్స్‌‌ చెప్పాడని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు చెప్పారు. దీంతో కొలరాడో పోలీసులు అతడి కోసం వేట సాగించారు. ఓ కాఫీ షాప్‌‌ దగ్గర ఆగిన డేవిడ్‌‌ను పట్టుకున్నారు. వానే దగ్గర వెపన్స్‌‌ ఉన్నాయనుకున్నా దొరకలేదని చెప్పారు.

For More News..

జూలో బాలుడిపై దూకిన పులి.. వీడియో వైరల్