
లాడర్‌హిల్: రిషబ్ పంత్ (31 బాల్స్‌లో 6 ఫోర్లతో 44), కెప్టెన్ రోహిత్ శర్మ (16 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33)కు తోడు యంగ్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ (3/12), అవేశ్ ఖాన్ (2/17), రవి బిష్నోయ్ (2/27) అద్భుత బౌలింగ్‌తో సత్తా చాటడంతో వెస్టిండీస్‌తో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో ఇండియా 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలుండగానే 3–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 స్కోరు చేసింది. రోహిత్, పంత్‌తోపాటు శాంసన్ (0 నాటౌట్), సూర్యకుమార్ (24), దీపక్ హుడా (21) కూడా రాణించారు. ఛేజింగ్‌లో ఇండియా బౌలర్ల దెబ్బకు విండీస్ 19.1 ఓవర్లలో 132కే ఆలౌటైంది.