మార్కెట్​ కాదు.. ఎయిర్​పోర్టు!

మార్కెట్​ కాదు.. ఎయిర్​పోర్టు!

చేపల మార్కెట్​ కంటే రద్దీగా ఉన్న ఇది ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు. రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లు తప్పనిసరిగా ఎయిర్ పోర్టులోనే ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించు కోవాలని, రిజల్ట్ వచ్చే వరకూ వేచి ఉండాలని కేంద్రం రూల్ పెట్టడంతో  టెస్టింగ్​ సెంటర్ల వద్ద జనం ఇలా భారీగా క్యూలు కట్టారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లకు ఒమిక్రాన్​ ఉందో లేదో తెలుసుకోవడం తర్వాత సంగతి.. ఒక్కరిద్దరికి ఉంటే అందరికీ అంటుకోవడం మాత్రం ఖాయమంటూ నెటిజన్స్ ట్వీట్స్​ చేస్తున్నారు. ర్యాపిడ్ టెస్టు రిజల్ట్​కు 2 గంటలు, ఆర్టీపీసీఆర్ రిజల్ట్​కు 6 నుంచి 8గంటల టైమ్ పడుతోంది.

కాగా, ఢిల్లీ ఎయిర్‌‌పోర్టుకు సంబంధించిన ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఎయిర్‌‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్‌, ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని అధికారులకు సూచించారు.