మరో మూడు గంటలు నాన్స్టాప్ వర్షాలు.. అవసమైతే తప్ప బయటకు రావద్దు

మరో మూడు గంటలు నాన్స్టాప్ వర్షాలు.. అవసమైతే తప్ప బయటకు రావద్దు

హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 22) మధ్యాహ్నం వరకు ఎండతో కాస్త రిలీఫ్ ఇచ్చిన వెదర్.. సాయంత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా మారిపోయింది. కుమ్యులో నింబస్ మేఘాలతో ముందుగానే చీకటి పడిందా అన్నట్లుగా వాతావరణం మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పొట్టు పొట్టు వానలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది.  దీంతో వాతావరణ కేంద్రం పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. 

ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్:

సాయంత్రం మొదలైన వర్షం.. మరో రెండు మూడు గంటలు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సాయంత్రం 7 గంటల వరకు భారీ వర్షం కురుస్తుందని అధికారులు ప్రకటించారు. 

గంటకు 41 -61 కి.మీ.ల మధ్య గరిష్ట ఉపరితల గాలి వేగంతో (గాలులు వీచే) మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం వుంది.  అందువలన ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ALSO READ : హైదరాబాద్ సిటీలో ఉరుములు, మెరుపులు..

ఈ జిల్లాలో మోస్తరు నుంచి తేలికపాటి వానలు:

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాలు, మెదక్, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 
గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ (గాలులలో) తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.