రూ.27 కోట్లు కూడా దాటని ఆదాయం 

రూ.27 కోట్లు కూడా దాటని ఆదాయం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరిగిన అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూములు, ఆస్తుల మార్కెట్ విలువలు మంగళవారం అమల్లోకి వచ్చాయి. మార్కెట్ వాల్యూస్ సవరించిన తర్వాత  సాధారణ రోజులతో పోలిస్తే తొలి రోజు ఇన్ కం సగానికి పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 4,232 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా రూ.27 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది.

ప్లాట్లు, ఫ్లాట్ల మార్కెట్ వాల్యూస్ పెంచడానికి ముందు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు  సాధారణ రోజుల్లో రోజువారీ ఆదాయం రూ.40 కోట్లు దాటేది. అయితే మార్కెట్ వాల్యూస్  పెరుగుతాయని తెలియడంతో ఫిబ్రవరి ఫస్ట్, సెకండ్ వీక్ లో చేసుకోవాలనుకున్న రిజిస్ట్రేషన్లను చాలామంది ముందస్తుగా చేసుకున్నారు. దీంతో ఆదాయం రూ.27  కోట్లు దాటలేదని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మార్కెట్ వాల్యూస్ పెంపుతో గత వారం  రోజులుగా జోరుగా సాగిన రిజిస్ట్రేషన్లకు ఒక్కసారిగా బ్రేక్ పడినట్లయింది.