ప్రజల సీఎంగా తిరిగి విధులు ప్రారంభిస్తున్నా.. వైరల్ అవుతున్న చంద్రబాబు లింక్డ్ ఇన్ అప్డేట్

ప్రజల సీఎంగా తిరిగి విధులు ప్రారంభిస్తున్నా.. వైరల్ అవుతున్న చంద్రబాబు లింక్డ్ ఇన్ అప్డేట్

సీఎంగా ఓత్ తర్వా త తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన లింక్డ్ ఇన్ ఫ్రొఫైల్ ను అప్డేట్ చేశారు. ఇది సీఎం తొలి అప్డేట్.. ఈ వార్తను నెటిజన్లతో పంచు కుంటూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను తిరిగి విధులు ప్రారంభిస్తున్నానని పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని రాశారు. ఈ పోస్ట్ సోషల్ మీడగియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పోస్ట్ తో ఊహించని విధంగా మద్దతుదారులు అభినందనలతో చంద్రబాబును ముంచెత్తారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ టీం ను 164 అసెంబ్లీ సీట్లతో గెలిపించి వారికి సేవ చేసేందుకు అఖండమైన ఆదేశాన్ని అందించారు.. భవిష్యత్తు కోసం మా టీం విజన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అహోరాత్రులు  పార్టీ కార్యకర్తలు, ఆఫీసు బేరర్లు, నేతలు శ్రమించారు. ఏకతాటిపై నడిచిన కూటమితో రాష్ట్ర ప్రజలు భాగస్వామ్యం కావడంతో నూతన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి మార్గం సుగమం చేసిందని చంద్రబాబు ఈ పోస్టులో రాశారు. 

 కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చేందుకు కృషి చేస్తుంది.. మాది ప్రజా ప్రభుత్వం.. వారి అంచనాలను నెరవేర్చడానికి , ప్రజా కేంద్రీకృత పాలనను అందించేందుకు కృషి చేస్తామని చంద్రబాబు అన్నారు. 

లింక్డ్ ఇన్ లో ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది. ఊహించని విధంగా అనేక మంది సపోర్టర్లను కూడగట్టింది. చంద్రబాబు అభినందనలతో ముంచెత్తారు.