కవరత్తి: ప్రధాని మోదీ లక్షద్వీప్ దీవులలో పర్యటించిన అనంతరం ఆ ప్రాంతంలో పర్యటకుల సంఖ్య పెరిగిందని అక్కడి పర్యటకశాఖ అధికారులు తెలిపారు. ఇంటర్నేషన్ టూరిస్టులు ఈ ద్వీపాన్ని విజిట్ చేసేందుకు ప్యాకేజీల కోసం తమను సంప్రదిస్తున్నారని అన్నారు. ఆన్‌లైన్‌లోనూ పెద్ద ఎత్తున లక్షద్వీప్ గురించి సెర్చ్ చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని క్రూయిజ్ షిప్ కంపెనీలను ప్రోత్సహించడానికి లక్షద్వీప్ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు.
లక్షద్వీప్‌కు వాయు రవాణాను మెరుగుపరచడం వల్ల టూరిస్ట్ లను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా మోదీ జనవరిలో కేంద్ర పాలిత ప్రాంతమై లక్షద్వీప్‌ను సందర్శించి విషయం తెలిసిందే.