ఢిల్లీలో దారుణం : భర్తను చంపి ఫ్రిజ్లో దాచిన భార్య

ఢిల్లీలో దారుణం : భర్తను చంపి  ఫ్రిజ్లో దాచిన భార్య

శ్రద్ధా వాకర్  ఘటనను మరువక ముందే ఢిల్లీలో అలాంటిదే మరో ఘటన జరిగింది. అక్షరధామ్ టెంపుల్ ఎదురుగా ఉన్న పాండవ్ నగర్లో ఈ  దారుణం చోటుచేసుకుంది. పూనమ్ అనే మహిళ కొడుకుతో కలిసి భర్తను హత్య చేసింది. హత్య తర్వాత శరీరాన్ని  22 ముక్కలు చేసి ఫ్రిజ్లో దాచిపెట్టింది. ఆ ముక్కలను క్రమంగా పరిసర ప్రాంతాల్లో  పడేసింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని తల్లీకొడుకులను అరెస్ట్ చేశారు. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతోనే పూనమ్ ఈ హత్య చేసినట్లు వారు తెలిపారు. ఈ ఘటన జూన్లో జరగ్గా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇటీవల శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆఫ్తాబ్ అనే యువకుడు హత్య చేశాడు. ఆ మరుసటి రోజు ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. 35 ముక్కలను 18 ప్యాకుల్లో వేసి.. ఒక్కో ప్యాక్‌ను ఒక్కోరోజు చొప్పున 18 రోజుల పాటు మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేశాడు. శ్రద్ధా తండ్రి నవంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.