పోలింగ్ స్టేషన్​ పరిశీలనకు సీఈసీ ట్రెక్కింగ్‌‌

పోలింగ్ స్టేషన్​ పరిశీలనకు సీఈసీ ట్రెక్కింగ్‌‌

డెహ్రాడూన్‌‌: ఉత్తరాఖండ్‌‌లోని చమోలి జిల్లాలో 18 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌‌ చేసి, మారుమూల పోలింగ్‌‌ స్టేషన్‌‌ను చీఫ్‌‌ ఎలక్షన్‌‌ కమిషన్‌‌ (సీఈసీ) రాజీవ్‌‌ కుమార్‌‌‌‌ సందర్శించారు. బద్రీనాథ్‌‌ నియోజకవర్గంలోని దుమక్‌‌, కాల్గోత్‌‌ గ్రామాల్లో పోలింగ్‌‌ బూత్‌‌లను శుక్రవారం పరిశీలించారు. ‘‘ఇలాంటి కొండ ప్రాంతాలను చేరుకోవడానికి పోలింగ్‌‌ సిబ్బందికి మూడ్రోజుల సమయం పడుతుంది. ఎన్నికల సమయంలో అక్కడికి చేరుకోవడానికి వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి నేను ఈ టెక్కింగ్ చేశాను. మరిన్ని కొండ ప్రాంతాలను సందర్శిస్తాను. ఆయా ప్రాంతాల్లో సౌలతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం’’అని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం...

గజ్వేల్‌‌లో స్పౌజ్ టీచర్ల ఆవేదన సభ

ప్రతి నెల ఒక రోజు పీహెచ్‌‌సీలోనే నిద్రించాలి