భూ నిర్వాసితులతో కలిసి కలెక్టరేట్​ ముందు ఆందోళన

భూ నిర్వాసితులతో కలిసి కలెక్టరేట్​ ముందు ఆందోళన

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో మోసపోయిన ఆదివాసీ రైతులకు ప్రభుత్వం తిరిగి భూములు ఇప్పించాలని జడ్పీ మాజీ చైర్ పర్సన్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి డిమాండ్​ చేశారు. బుధవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు అనంత్ నాయక్ ను కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు.  అంతకు ముందు భూ నిర్వాసితులతో కలిసి కలెక్టరేట్​ ముందు ఆందోళన చేపట్టారు.  

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ కోసం స్థానిక ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి ఆదివాసీల  వ్యవసాయ భూములు తీసుకుని అయిదేళ్లు గడిచిపోయాయన్నారు. అయినా ఇప్పటివరకు పరిశ్రమ ప్రారంభం కాలేదన్నారు.  జీవో నెంబర్ 40 ప్రకారం మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు పరిశ్రమ పనులు ప్రారంభించలేరన్నారు.  

ఎస్టీ కమీషన్ సభ్యులు వస్తే జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడం, సమస్యను విన్నవించడానికి వచ్చిన ఆదివాసీలతో ఎస్పీ ప్రవర్తించిన తీరు సరిగా లేదన్నారు. బాధితులకు వెంటనే భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట బీజేపీ లీడర్లు ఉన్నారు.