కలెక్టరేట్​ ముందు పంచాయతీ కార్మికుల ఆందోళన

కలెక్టరేట్​ ముందు పంచాయతీ కార్మికుల ఆందోళన
  • జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేత

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లోని  కలెక్టరేట్  కార్యాలయం గేట్ ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళనకు దిగారు.  పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ 22 రోజులగా కార్మికులు సమ్మెకు చేస్తున్న విషయం విదితమే.  

సరైన వేతనాలు ఇవ్వాలని వారి ప్రధాన డిమాండ్. సమ్మెలో ఉన్న వారిని సెక్రటరీలు బెదిరిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.  వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆందోళనకు దిగిన కార్మికులకు లెఫ్ట్ పార్టీలు సంఘీభావం తెలిపాయి.   

సరైన వేతనాలతో పాటు, ఈఎస్​ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్​ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  అనంతరం  జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని అధికారి చెప్పారు.