ఆర్మూర్, వెలుగు : జగిత్యాలలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో సంవత్సరం స్టూడెంట్స్ సోమవారం ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఫీల్డ్ విజిట్‌లో భాగంగా అంకాపూర్ గ్రామాన్ని సందర్శించి గ్రామాభివృద్ధి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పంట పొలాలను పరిశీలించి సాగు విధానాలపై రైతులతో ముచ్చటించారు. గ్రీన్ విజన్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు. విత్తన ఉత్పత్తి చేసే ప్రక్రియను పరిశీలించారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న సోర్గం సుడాన్ గ్రాస్ పంటను పరిశీలించారు. అగ్రికల్చర్ కాలేజీ లెక్చరర్స్ డాక్టర్ సతీశ్, డాక్టర్ అర్చన, డాక్టర్ జయంత్, శ్రీలత, స్టూడెంట్స్ పాల్గొన్నారు.

