రూ.425 కోట్లతో మిషన్ భగీరథ : మంత్రి నిరంజన్ రెడ్డి

రూ.425 కోట్లతో  మిషన్ భగీరథ : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు:  జిల్లా కేంద్రంలో  తాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చేందుకు రూ.425 కోట్లతో ప్రత్యేకంగా మిషన్ భగీరథ పథకం చేపట్టామని  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలో విలేకరులతో మంత్రి  మాట్లాడారు. వచ్చే 50 ఏళ్ల వరకు నీటి కొరత ఉండదన్నారు.

పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్​ శుక్రవారం శ్రీకారం చుడతారని చెప్పారు. పట్టణంలో1,500  డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు అందించామన్నారు. రూ.5.75 కోట్లతో సురవరం సాహితీ కళాభవనం (టౌన్ హాల్)ను  నిర్మించామన్నారు. ఐటీ టవర్ , రూ.20 కోట్లతో సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేశామన్నారు.

ALSO READ  : భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కట్టుబడి ఉన్నాం : జస్టిన్ ట్రూడో

వనపర్తి తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి మోడ్రన్​ లైబ్రరీని, రూ.76 కోట్ల బైపాస్ రహదారికి, రూ.48 కోట్లతో పెబ్బేరు రహదారికి,  రూ. 22 కోట్లతో వనపర్తి రాజప్రాసాదం పునరుద్ధరణ, పాలిటెక్నిక్ హాస్టల్స్ నిర్మాణానికి  కేటీఆర్​ శంకుస్థాపన  చేస్తారని తెలిపారు. అలాగే  సంకిరెడ్డిపల్లిలో రూ.300 కోట్లతో నిర్మించే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. 

కేటీఆర్ సభకు భారీ ఏర్పాట్లు.           

          
మంత్రి కేటీఅర్ పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 50 వేల మందిని సమీకరిస్తున్నారు. సభకు మంత్రులు  దయాకర్ రావు, గంగుల కమలాకర్ తదితరులు హాజరు కానునన్నారు.   సమావేశంలో  మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ రమేశ్ గౌడ్,  గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.