
న్యూఢిల్లీ : మధ్యంతర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌లో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్‌లతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వివిధ పార్టీల నాయకులు పార్లమెంటులో లేవనెత్తాలని అనుకుంటున్న సమస్యలు, ప్రభుత్వ ఎజెండాపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు బడ్జెట్సమావేశాలు జరగనున్నాయి. ఈ సారి లోక్‌సభ ఎన్నికలకు ముందే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.