
రానా తమ్ముడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ రూపొందిస్తున్న చిత్రం ‘అహింస’. గీతిక హీరోయిన్. ఆనంది ఆర్ట్స్ బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆర్పీ పట్నాయక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 'నీతోనే నీతోనే', 'కమ్మగుంటదే' పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఇదొక యూత్ ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్పారు మేకర్స్. సదా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించ నుంది. రజత్ బేడీ, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ ఇతర పాత్రలు పోషించారు.