వ్యాక్సిన్ వేసుకుంటే.. ఫ్రీ గిఫ్ట్స్.. కేజీ వంట నూనె కూడా

V6 Velugu Posted on Dec 02, 2021

ఓవైపు ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తోంది. మరోవైపు దేశంలో ఇంకా చాలామంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. మారు మూల గ్రామాలతో పాటు సిటీలో ఉన్న జనం కూడా ఇప్పటికీ పూర్తిగా వ్యాక్సిన్ తీసుకోలేదు. అధికారులు, నాయకులు ఎంత మొత్తుకుంటున్నా కూడా.. కొందరు కరోనా టీకా తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ వెలగులోకి వచ్చిన నాటి నుంచి దేశ వ్యాప్తం గా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఓమిక్రాన్ మన దేశం లో కి అడుగు పెట్టకుండా ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకునేలా గుజరాత్ అహ్మాదాబాద్ మున్సిపల్ సిబ్బంది కొత్త ఆఫర్లు ప్రకటించారు. వ్యాక్సిన్ వేసుకున్నవారికి ఫ్రీ గిఫ్ట్ ఇస్తామన్నారు. 

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వ్యాక్సినేషన్ కోసం కాస్త కొత్తగా ఆలోచించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి బహుమతులు ఇస్తామని ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 మధ్య వ్యాక్సిన్ తీసుకున్న వారందిరి లో లక్కి డ్రా తీసి మొదటి బహుమతి గా రూ. 60 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా ఈ లక్కీ డ్రా లో గెలిచిన 25 మందికి రూ. 10 వేల విలువైన బహుమతులు కూడా ఇస్తామని ప్రకటించారు. అంతే కాదు మురికి వాడాల్లో వారు వ్యాక్సిన్ తీసుకుంటే కిలో వంట నూనే ను కూడా ఫ్రీ గా ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన తో అహ్మదాబాద్ లో గత రెండు రోజుల నుంచి వ్యాక్సిన్ లు వేసుకోవడానికి ప్రజలు పోటీ పడుతున్నారు.

Tagged COVID-19 vaccination, Ahmedabad civic body, free gifts for vaccine

Latest Videos

Subscribe Now

More News