గత 10 ఏళ్ల మోదీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలికసదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని ట్వీట్ చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై కప్పు కూలిందని, గతంలో జబల్ పూర్ విమానాశ్రం పైకప్పు పడిపోయిందన్నారు. అయోధ్యలో కొత్త రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు.
రామమందిరంలో నీళ్లు లీక్ అవుతున్నాయని తెలిపారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్డులో పగుళ్లు ఏర్పాడ్డాయన్నారు. 2023, 24లో బిహార్ లో 13 కొత్త వంతెనలు కూలిపోయాయన్నారు ఖర్గే.గుజరాత్ మోర్బీలో బ్రిడ్జి కూలిపోయిందని చెప్పారు. ఈ ఘటనలన్నీ మోదీ 10 ఏళ్ల పాలనకు నిదర్శనమన్నారు ఖర్గే.
భారీ వర్షం, ఈదురు గాలులకు జూన్ 28న ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోని టర్నినల్ 1 దగ్గర పై కప్పు కూలిపోయింది. షెడ్ కింద ఉన్న ఒకరు మృ తి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విమానా రాకపోకలపై ప్రభావం పడింది. అక్కడి నుంచి బయలు దేరాల్సిన విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతులకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Mr̥tulaku rū.20 Lakṣalu,
