జాతీయ పార్టీలో ఎవరైనా రాజ్యసభ ఎంపీ కావొచ్చు : నిరంజన్ 

జాతీయ పార్టీలో ఎవరైనా రాజ్యసభ ఎంపీ కావొచ్చు : నిరంజన్ 
  • పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ 

హైదరాబాద్, వెలుగు : రాష్ర్టం నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని ఏఐసీసీ ప్రకటించిందని, ఆయన అభ్యర్థిత్వాన్ని పీసీసీ స్వాగతిస్తున్నదని వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ తెలిపారు. జాతీయ పార్టీలో ఎవరైనా రాజ్యసభ ఎంపీ కావొచ్చని చెప్పారు. ఈ విషయం తెలియక బీఆర్ ఎస్ నేతలు అవాక్కులు, చవాక్కులు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో నిరంజన్ మీడియాతో మాట్లాడారు.  సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అయిన సింఘ్వీ రాజ్యసభలో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

సింఘ్వీ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ కారులను ఉరికిచ్చి కొట్టిన వారికి గత 10 ఏండ్లలో మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి గెలిపించారన్నారు. ఎన్నికల్లో ఓడించినా బీఆర్ ఎస్ కు బుద్ధి రాలేదని, మహిళలను కించపరిచేలా కేటీఆర్ మాట్లాడారని నిరంజన్ వివరించారు.