
- పార్టీ కోసం కష్టపడ్డవారికే పదవులు
- డీసీసీ నియాకంపై అందరి అభిప్రాయాలు తీసుకుంటాం
- ఏఐసీసీ పరిశీలకుడు అజయ్ సింగ్
ఆదిలాబాద్, వెలుగు: క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ పరిశీలకుడు, కర్నాటక ఎమ్మెల్యే అజయ్ సింగ్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన సంఘటన్ సృజన్ అభయాన్‌లో ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిహార్, హర్యానాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నల్ల ధనాన్ని బయటికి తీస్తానని ప్రగల్భాలు పలికిన మోదీ.. కార్పొరేట్లకు కోట్ల రుణాలు మాఫీ చేశారని, కానీ అన్నం పెట్టే అన్నదాతలకు మాత్రం రుణ మాఫీ చేయడంలేదని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో అందరి అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ కోసం కష్టపడ్డవారికే పదవులు ఇస్తామని స్పష్టం చేశారు.
అనంతరం డీసీసీ నియామకాల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపుల లక్ష్మయ్య, కార్యక్రమ కో ఆర్డినేటర్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్, డీసీసీబీ చైర్మన్ బోజారెడ్డి, ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, సంఘటన్ సృజన్ సమన్వయకర్త చంద్రశేఖర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఏఐసీసీ మెంబర్ నరేశ్ జాదవ్, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
కార్యకర్తల అభిప్రాయం మేరకే పార్టీ పదవులు
భైంసా, వెలుగు: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల నియామకంలో కార్యకర్తల అభిప్రాయానికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని ఏఐసీసీ పరిశీలకుడు అజయ్సింగ్అన్నారు. మంగవారం నిర్మల్‌జిల్లా భైంసాలోని ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అంతకుముందు సంఘటన్ సృజన్అభియాన్కు చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు.
కేంద్రంలోని బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. మరోసారి ఓట్చోరీ ద్వారా బిహార్ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు. బిహార్‌లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, జిల్లా కోఆర్డినేటర్రాంభూపాల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఐకేరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, నారాయణ్‌రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.