తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం: మల్లిఖార్జున్ ఖర్గే

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం: మల్లిఖార్జున్ ఖర్గే

మెదక్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా మెదక్ జిల్లా రాందాస్ చౌరస్తాలో జరిగిన సభలో పాల్గొన్న ఖర్గే మాట్లాడుతూ.. రైతులు, పేద ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు పక్షాన నిరంతరం పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. పదేళ్లలో మోదీ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిందేమి లేదు.. 30 లక్షల ఉద్యోగాల ఇవ్వకుండా  నిరుద్యోగుల జీవితాలతో మోదీ ఆడుకుంటున్నారని విమర్శించారు. 

బీఆర్ఎస్కు బీటీం బీజేపీ అన్నారు మల్లిఖార్జున్ ఖర్గే. సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.కర్ణాటకలో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తున్నాం..ఏమైనా అనుమానం ఉంటే బస్సు ఏర్పాటు చేస్తాం..వెళ్లి చూడండి అని ఖర్గే అన్నారు. ప్రజల బతుకులు మారాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మల్లిఖార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.