అబద్ధాల కేసీఆర్​ను గద్దె దించాలి : క్రిస్టోఫర్ తిలక్

అబద్ధాల కేసీఆర్​ను  గద్దె దించాలి :  క్రిస్టోఫర్ తిలక్
  •     ఏఐసీసీ సెక్రటరీ క్రిస్టోఫర్ తిలక్ 

కోనరావుపేట/ వేములవాడరూరల్, వెలుగు ; రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న అబద్ధాల సీఎం ను గద్దెదించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు కచ్చితంగా తగులుతుందని ఏఐసీసీ సెక్రటరీ క్రిస్టోఫర్ తిలక్  అన్నారు. మంగళవారం కోనరావుపేట, రుద్రంగి మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  రాబోయే ఎన్నికల్లో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు.   అనంతరం  ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్  మాట్లాడుతూ..  

నియోజకవర్గం  అభివృద్ధిలో వెనకబడిందని, తనకు అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తానని అన్నారు.  ఈ సందర్భంగా పలుగ్రామాల నుంచి సుమారు 100 మంది యువకులు కాంగ్రెస్ లో చేరారు.  కార్యక్రమంలో  పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్, జిల్లా కార్యదర్శి కచ్ఛకాయల ఎల్లయ్య, తాల్లపెల్లి ప్రభాకర్ పాల్గొన్నారు.