బోయినిపల్లిలో కత్తిపోట్ల కలకలం

బోయినిపల్లిలో కత్తిపోట్ల కలకలం

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి శివారులో బుధవారం రాత్రి కత్తి పోట్ల వ్యవహారం కలకలంగా మారింది. రూరల్ సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గండి శ్రీధర్ భార్యకు అదే గ్రామానికి చెందిన సావనపెల్లి శశిప్రీతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం ఉంది. ఈక్రమంలో శశిప్రీతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎక్కించుకొని దేశాయిపల్లి శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడిచేశాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శశి ప్రీతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. నిందితుడు శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.