డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత : ఎస్పీ అశోక్ కుమార్

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత : ఎస్పీ అశోక్ కుమార్
  • జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్

రాయికల్, వెలుగు: డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గంజాయి మహామ్మారిని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించి భావితరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జగిత్యాల ఎస్పీ అశోక్​కుమార్​కోరారు. బుధవారం రాయికల్ మండల కేంద్రంలో జిల్లా పోలీస్ శాఖ, రాయికల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి  ఆయన హాజరై మాట్లాడారు. యువత డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గంజాయికి బానిసలైతే వారి భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాశనం అవుతుందని హెచ్చరించారు.

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరఫరా, వినియోగంపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల నివారణకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీల్లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ సుధాకర్, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐలు సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, గీత, కృష్ణ, తహసీల్దార్​నాగార్జున, జేఏసీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, పాల్గొన్నారు.