పెద్దదిన్నె గ్రామాభివృద్ధికి కృషి చేస్తా : ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

పెద్దదిన్నె గ్రామాభివృద్ధికి కృషి చేస్తా : ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

ఇటిక్యాల, వెలుగు : పెద్దదిన్నె గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఏఐసీసీ కార్యదర్శి, ఛతీస్​గఢ్ ఇన్​చార్జి సంపత్ కుమార్ అన్నారు.  ఇటిక్యాల మండలంలో పెద్దదిన్నె లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సంపత్ కుమార్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

అనంతరం సర్పంచ్ సుజాత శాలువా పూలమాలతో ఆయనను సత్కరించారు. ఆయన వెంట అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శీను, ఆయా గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచులు, ఎస్ఐ రవి ఉన్నారు.