ఆయుష్మాన్ భారత్ కిందకు రాని 51 లక్ష మంది పరిస్థితేంటి..?

 ఆయుష్మాన్ భారత్ కిందకు రాని 51 లక్ష మంది పరిస్థితేంటి..?
  • జీవో 245 ప్రకారం మాస్కు పెట్టుకోకుంటే 31 కోట్లు ఫైన్లు వేశారు
  • మరి అదే జీవో ప్రకారం దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోరు
  • బీహార్ లో తేజస్వియాదవ్ తన ఇంటినే కోవిడ్ కేంద్రంగా మార్చేశాడు.. ఆసోయి మనోళ్లకు లేదేం?
  • ఎన్నికల డ్యూటీ చేసిన అధికారులకు యూపీ సర్కార్ 30 లక్షలిస్తామంటే అక్కడి కోర్టు కోటి రూపాయలని చెప్పింది
  • ఇక్కడ కూడా కరోనాతో చనిపోయిన అధికారుల కుటుంబాలకు కోటి రూపాయలివ్వాలి
  • ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

హైదరాబాద్: ‘‘కరోనాను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని చెప్పి రాత్రికి రాత్రే ఆరోగ్యశ్రీ కుదరదు ఆయుష్మాన్ భారత్ లో చేర్చడానికి కారణాలేంటి.. ఆయుష్మాన్ భారత్ లో చేర్చడం.. మంచిదే.. కానీ ఆలస్యం ఎందుకైంది.. ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల మంది లబ్దిపొందుతారు. అదే ఆరోగ్య శ్రీ ఐతే.. 77 లక్షల మంది లబ్దిపొందే అవకాశం ఉందని వారే చెప్పారు.. మరి ఆయుష్మాన్ భారత్ కిందకు రాని 51 లక్ష మందికి, హెల్త్ కార్డులు వున్న వారికీ ఎలా న్యాయం చెస్తారొ చెప్పాలి..’’ అని  ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీ భవన్ నుంచి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ లో తేజస్వి యాదవ్ తన ఇంటిని ఐసొలేట్ సెంటర్ గా మార్చారు.. ఆ సోయి మనోళ్లకు లేదు అని ఎద్దేవా చేశారు.  
2014 ఎన్నికల్లో  ప్రతి జిల్లాలో నిమ్స్ స్థాయి హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు ఏమైంది..? ఎక్కడ ఏర్పాటు చేశారు? కరోనా  సెకండ్ వేవ్ కు తోడు  బ్లాక్ ఫంగస్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలన్నారు. తమిళ నాడులో స్టాలిన్ ప్రతిపక్షాలతో టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారు.  కానీ ఇక్కడ మీరు మంత్రి కేటీఆర్ కు అప్పగించడం ఏంటి ? టీఆర్ఎస్ పార్టీ లోని కొందరికే రెమిడీసీవర్ ఇంజక్షన్ అందుబాటులో ఉంటుంది.. ఇతర పార్టీ నాయకులకు ఎందుకు దొరకడం లేదు..? కోవిడ్ డ్రగ్స్ పక్కదారి పట్టిస్తే, బ్లాక్ చేస్తే అది నేరమని తెలీదా.. అని ప్రశ్నించారు. 

తెలంగాణలో మాస్కులు పెట్టుకోకుంటే..31 కోట్ల రూపాయలు  ఫైన్ లు వేసినట్లు డీజీపీ  చెప్పారు..ఇది మరీ దారుణం.. సర్కార్ ఉచితంగా పంపిణి చేయాల్సింది పోయి.. ఫైన్ ల రూపంలో పిండేస్తున్నారు. అడ్డగోలుగా దండుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. 245 జీవో ప్రకారం మాస్క్ లేకుంటే.. ఫైన్ లు వేసిన పోలీసులు.. అదే జీవో ప్రకారం.. ఇష్టానుసారం దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దాసోజు శ్రవణ్ నిలదీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్స్ ను కూడా ఐసోలేషన్ సెంటర్లుగా మార్చాలని, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలను ఆదుకోవాలన్నారు. జర్నలిస్ట్ లను కూడా ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలని దాసోజు శ్రవణ్ సూచించారు. 

యూపీ సర్కార్.. ఎన్నికల్లో డ్యూటీ చేసిన అధికారులకు 30లక్షలు ఇవ్వాలనుకుంటే.. అక్కడి కోర్టు.. కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పింది..ఇక్కడ కూడా ఎన్నికల్లో పాల్గొన్న అధికారులు కరోనా సోకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సోకి ఇబ్బంది పడి చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్స్, ఛైర్మెన్లను ఇవ్వాళ నియమించారు సంతోషం.  కేసీఆర్ కు తొత్తులుగా పనిచేసే వారికే టీఎస్పీఎస్సి లో పదవులొచ్చాయి..పదవులు పంచినట్లు కాదు.. వారం రోజుల్లో 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలి, రాష్ట్రంలో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా వెంటనే రెగ్యూలర్ చేయాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.