
ఏఐసీసీ తెలంగాణ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఖానాపూర్ చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మీనాక్షి నటరాజన్. తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశానికి ఆదర్శమని... నిరుపేదల, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రబుత్వం పాటుపడుతోందని అన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని అన్నారు.
ఆదివాసీలకు జల్, జంగల్, జమీన్ పై హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. నెహ్రు నుండి రాజీవ్ గాంధీ వరకు ఆదివాసీల సంక్షేమం కోసం పాటుపడ్డారని అన్నారు.ఇందిరా గాందీ అదివాసీలను ప్రేమించేవారని.. ఇందిరా గాందీకి పునర్జన్మ ఉంటే అదివాసీగా పుట్టాలని కోరుకున్నారని అన్నారు.
Also Read : ఈత సరదా ప్రాణం మీదకు తెచ్చింది
రుణమాఫీ చేసి రైతులకు భరోసానించామని అన్నారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ పాటుపడుతోందని అన్నారు. పోడు భూములకు హక్కులిచ్చామని.. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తున్నామని అన్నారు.రాబోయే రోజుల్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం అమలు చేస్తామని అన్నారు మీనాక్షి నటరాజన్.