Sunrisers captain : హైదరాబాద్ కెప్టెన్గా సౌతాఫ్రికా ప్లేయర్కి ఛాన్స్

Sunrisers captain : హైదరాబాద్ కెప్టెన్గా సౌతాఫ్రికా ప్లేయర్కి ఛాన్స్

ఐపీఎల్ లో హైదరాబాద్ హోం టీం సన్ రైజర్స్ హైదరాబాద్.. కెప్టెన్ ని ప్రకటించింది. కెప్టెన్ గా ట్రోఫీని అందించిన డేవిడ్ వార్నర్ ను, ఒక సీజన్లో ఫైనల్ కు తీసుకెళ్లిన కేన్ విలియమ్సన్ ను వదులుకున్న తర్వాత ఫ్రాంచేజీ జట్టు పగ్గాలు ఎవరికి అందిస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. దానికి తెరదించుతూ సన్ రైజర్స్ కెప్టెన్ గా సౌతాఫ్రికా క్రికెటర్ ఐడెన్ మార్క్రమ్‌ ను నియమించింది. 

కొందరు టీమిండియా ప్లేయర్ మయాంక్ అగర్వాల్ ని చేయాలని సూచిస్తే, మరికొందరు ఐడెన్ మార్క్రమ్‌ ని కెప్టెన్ చేయాలని కోరారు. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ లో మార్క్రమ్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి విజేతగా నిలిపాడు. దాంతో ఫ్రాంచేజీ మార్క్రమ్ పై నమ్మకముంచి కెప్టెన్సీ పగ్గాలు అందించింది.