బ్లాక్ ​ఫంగస్​ కేసుల్లో.. 95% షుగర్​ బాధితులే

బ్లాక్ ​ఫంగస్​ కేసుల్లో.. 95% షుగర్​ బాధితులే

న్యూఢిల్లీ: బ్లాక్​ ఫంగస్​ కేసులపై డాక్టర్లంతా అలర్ట్​గా ఉండాలని ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్​ రణ్​దీప్​ గులేరియా సూచించారు. రాబోయే రోజుల్లో ఆ కేసులు మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. కరోనా పేషెంట్లలో ఎప్పటికప్పుడు షుగర్​ లెవెల్స్​ను చెక్​ చేయాలని, షుగర్​ కంట్రోల్​లో ఉండేలా చూడాలని అన్నారు. ప్రస్తుతం వస్తున్న బ్లాక్​ఫంగస్​ కేసుల్లో 95% షుగర్​ బాధితులేనని చెప్పారు. స్టెరాయిడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్​ స్థాయిలు ఎక్కువై బ్లాక్​ఫంగస్​ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. కరోనా ట్రీట్​మెంట్​లో వాడే టొసిలిజుమాబ్​ కూడా కారణమవుతోందా అన్న దానిపైనా పరిశీలన చేస్తున్నామన్నారు. ఫస్ట్​వేవ్​లో కరోనా తగ్గిపోయాకే బ్లాక్​ఫంగస్​ ఎటాక్​ చేసిందని, కానీ, ఇప్పుడు పాజిటివ్​ ఉన్న వారిలోనూ దాని లక్షణాలు కనిపిస్తున్నాయని హెచ్చరించారు. స్టెరాయిడ్లను జాగ్రత్తగా వాడాలని, మోతాదుకు మించి ఇవ్వొద్దని ఆయన సూచించారు. 

వేరియంట్లపై వ్యాక్సిన్​ పనితీరు తెల్వదు

కరోనా వ్యాక్సిన్​ ఫుల్​గా (రెండు డోసులు) వేసుకున్నా మాస్క్​ పెట్టుకోవాల్సిందేనని, ఎడం పాటించాల్సిందేనని గులేరియా స్పష్టం చేశారు. వైరస్​లో చాలా మార్పులు జరుగుతున్నాయని, ఆ మార్పులతో పుట్టుకొస్తున్న కొత్త రకాలపై ఎన్ని వ్యాక్సిన్లు, ఎంత వరకు పనిచేస్తాయన్నది కచ్చితంగా చెప్పలేమన్నారు. ఫుల్​ వ్యాక్సిన్​ వేసుకున్నోళ్ల మాస్క్​ పెట్టుకోనక్కర్లేదన్న అమెరికా ప్రకటన తొందరపాటేనన్నారు.