ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లు హ్యాక్.. వెలుగులోకి సంచలన నిజాలు

ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లు హ్యాక్.. వెలుగులోకి సంచలన నిజాలు

ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ ఘటనలో సంచలన విషయం బయటకొచ్చింది.సైబర్ దాడి వెనక చైనా హ్యాకర్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. హ్యాక్ చేసిన డేటాను ఆసుపత్రి వర్గాలు తిరిగి పొందినట్లు తెలుస్తోంది. ఎయిమ్స్ లో మొత్తం 100 సర్వర్లుండగా.. అందులో 40 భౌతికంగా, 60 వర్చువల్ గా పనిచేస్తున్నాయి. ఇందులో 5 సర్వర్లలోకి హ్యాకర్లు చొరబడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సర్వర్లలోని లక్షలాది మంది రోగుల డేటాను తిరిగి పొందినట్లు చెప్పారు.

ఎయిమ్స్ లో సర్వర్లు మొరాయించినట్లు నవంబరు 23న తొలిసారి గుర్తించారు. ఎయిమ్స్ నుంచి హ్యాకర్లు 200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. హ్యాక్ చేసిన సర్వర్లలో కోట్లాది మంది రోగుల సమాచారం నిక్షిప్తమై ఉంది. ఇందులో VVIP, రాజకీయ నాయకులు,సెలబ్రిటీల సమాచారం కూడా ఉంది.హ్యాకింగ్ గురించి తెలియగానే.. ఎయిమ్స్ లో అన్ని సర్వర్లు, కంప్యూటర్లకు యాంటీ వైరస్ సొల్యూషన్ ప్రక్రియ చేపట్టారు.