ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌లో నర్సింగ్‌‌‌‌ ఆఫీసర్​ పోస్టులు

 ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌లో నర్సింగ్‌‌‌‌ ఆఫీసర్​ పోస్టులు

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అఖిలభారత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్‌‌‌‌)ల్లో నర్సింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది. బీఎస్సీ నర్సింగ్,   జీఎన్‌‌‌‌ఎం కోర్సులు పూర్తిచేసుకున్నవారు అర్హులు. వీటిని నర్సింగ్‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ కామన్‌‌‌‌ ఎలిజిబిలిటీ టెస్టు (ఎన్‌‌‌‌ఓఆర్‌‌‌‌సెట్‌‌‌‌)లో చూపిన ప్రతిభతో నింపుతారు. పరీక్షలో సాధించిన స్కోరు ఆరు నెలల వరకు చెల్లుతుంది. ప్రస్తుతం ఖాళీల వివరాలు ప్రకటించనప్పటికీ వేలల్లో ఉండే అవకాశం ఉంది.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ప్రస్తుత నోటిఫికేషన్​లో పరీక్ష విధానం మారింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌‌‌‌ రెండూ ఉంటాయి. గతంలో స్టేజ్‌‌‌‌-1 మాత్రమే ఉండేది. ముందు ప్రిలిమ్స్‌‌‌‌ నిర్వహిస్తారు. దీని వ్యవధి 90 నిమిషాలు. మొత్తం 100 మల్టిపుల్‌‌‌‌ ఛాయిస్‌‌‌‌ ప్రశ్నలు వస్తాయి. ఇందులో 80 సబ్జెక్టుకు సంబంధించినవే ఉంటాయి. మిగిలిన 20 జనరల్‌‌‌‌ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్‌‌‌‌ విభాగాల నుంచి వస్తాయి. ప్రిలిమ్స్‌‌‌‌లో అర్హత సాధించినవారి జాబితా నుంచి కేటగిరీల వారీ ఉన్న ఖాళీలకు 5 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్స్‌‌‌‌కు అవకాశం కల్పిస్తారు.  పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. వంద ఆబ్జెక్టివ్‌‌‌‌ ప్రశ్నలు వస్తాయి. 

అర్హత: బీఎస్సీ నర్సింగ్‌‌‌‌/ పోస్టు బేసిక్‌‌‌‌ బీఎస్సీ నర్సింగ్‌‌‌‌ లేదా జీఎన్‌‌‌‌ఎంతోపాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం. వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. ఆగస్టు 25 సాయంత్రం 5 వరకు అప్లికేషన్స్​ ఆన్​లైన్​లో  స్వీకరిస్తారు.   సీబీటీ స్టేజ్‌‌‌‌-1 సెప్టెంబరు 17, స్టేజ్‌‌‌‌-2 అక్టోబరు 7న నిర్వహించనున్నారు. వివరాలకు www.nursingofficer.aiimsexams.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.