అక్కడ బంగారం పెట్టుకొని ఎయిర్‌హోస్ట్ గోల్డ్ స్మగ్లింగ్

అక్కడ బంగారం పెట్టుకొని ఎయిర్‌హోస్ట్ గోల్డ్ స్మగ్లింగ్

ఎయిర్ ఇండియాలో హోస్ట్ గా పని చేసే యవతి అక్రమంగా దాదాపు కేజీ బంగారం రవాణా చేస్తూ అధికారులకు దొరికిపోయింది. మే 28న మస్కట్ నుంచి కేరళలోని కన్నూర్ కు వచ్చిన ఫ్లైట్ లో సురభి ఖతున్ అనే ఎయిర్ హోస్ట్ 960 గ్రాముల బంగారాన్ని ప్రైవేట్ పార్ట్స్ లో పెట్టుకొని స్మగ్లింగ్ కు పాల్పడింది. విమానం కన్నూర్ కు చేరుకోగానే సిబ్బందిని అధికారులు చెక్ చేశారు. దీంతో ఎయిర్‌హోస్ట్‌ బండారం బయటపడింది.

సురభి ఖాతున్ బంగారాన్ని ఇలా అక్రమంగా తరలించడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈసారి ఆమె పురీషనాళం(రెక్ట్రం)లో బంగారాన్ని దాచి తరలిస్తుండగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. సురభి ఖతున్‌ను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఆమె నెటీవ్ ప్లేస్ కోల్‌కతా.