ఎయిర్‌‌ఇండియా ఫ్లైట్‌లోని సెక్యూరిటీ స్టాఫ్‌కు కరోనా

ఎయిర్‌‌ఇండియా ఫ్లైట్‌లోని సెక్యూరిటీ స్టాఫ్‌కు కరోనా
  • ఢిల్లీ–-లుధియానా ఫ్లైట్‌లో డ్యూటీ
  •  ప్యాసింజర్లంతా హోం క్వారంటైన్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ – లుధియానా ఎయిర్‌‌ ఇండియా ఫ్లైట్‌లో సోమవారం డ్యూటీ చేసిన సెక్యూరిటీ స్టాఫ్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. లుధియానాలో దిగిన తర్వాత చేసిన టెస్టుల్లో ఆయనకు కరోనా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఫ్లైట్‌లోని ప్యాసింజర్లకు టెస్టులు చేయగా అందరికీ నెగటివ్‌ వచ్చిందని అన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలించామని, ప్యాసింజర్లను హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు. ఢిల్లీకి చెందిన సెక్యూరిటీ స్టాఫ్‌ ఎయిర్‌‌ఇండియా ఫ్లైట్‌లో సోమవారం డ్యూటీ చేశారని, ఫ్లైట్‌ దిగిన తర్వాత టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్‌ వచ్చిందని డిప్యూటీ కమిషనర్‌‌ ప్రదీప్‌ అగర్వాల్‌ చెప్పారు. దీంతో ఇప్పటి వరకు ఫ్లైట్‌లో జర్నీ చేసినవారి116 శ్యాంపిల్స్‌ టెస్ట్‌ చేశామని అన్నారు. డొమెస్టిక్‌ ఫ్లైట్స్‌ స్టార్ట్‌ అయిన మొదటి రోజే వైరస్‌ విజృంభించడం కూడా మొదలైంది. సోమవారం ఇండిగోలో చెన్నై నుంచి కోయంబతూర్‌‌ వెళ్లిన ఒక యువకుడికి కూడా కరోనా రావడంతో ఫ్లైట్‌లోని సిబ్బంది, ప్యాసింజర్లను క్వారంటైన్‌కు తరలించారు.