
ఓ సీనియర్ పైలెట్ మూర్ఖత్వంతో విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. దీంతో అతని లైసెన్స్ ను మూడు నెలల పాటు రద్ధు చేశారు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులు. 2017 లో ఈ ఘటన జరుగగా వాస్తవాలు ఇప్పుడు బయటపడ్డాయి. 102 మంది ప్రయాణీకులతో అబుదాబీ నుంచి ఇండియాకు బయలుదేరిన ‘ఇండియా ఎక్స్ ప్రెస్ IX452’ విమానం… ల్యాండింగ్ అయ్యే సమయానికి భారీ వర్షం పడుతుంది.. దీంతో పైలట్లకు రన్ వే కనిపించలేదు.
విమాన స్పీడును తగ్గించాలని సీనియర్ పైలట్ ను కో-పైలట్ కోరింది. తన కన్నా 30 సంవత్సరాలు చిన్నదైన కో-పైలట్ తనకు చెప్పేది ఏంటన్న అహంకారంతో ఆమె హెచ్చరికలను పట్టించుకోలేదు సీనియర్ పైలట్. దీంతో అదే స్పీడుతో విమానాన్ని ల్యాండ్ చేయడంతో అది క్రాష్ ల్యాండింగ్ అయింది. దీంతో విమాన టైరు వాటర్ డ్రైనేజీలో ఇరుక్కుంది. ఈ ఘటనపై విచారణ జరిపిన డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. సీనియర్ పైలట్‌దే తప్పని తేల్చింది. తన కంటే 30 ఏళ్ల వయస్సు తక్కువున్న కో-పైలట్ హెచ్చరికలను పట్టించుకోకుండా విమానాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. ఈ ఘటన ఆధారంగా.. ఇకపై విమానంలోని పైలెట్ల మధ్య వయస్సు వ్యత్యాసం లేకుండా ఉండాలని DCGA విమానసంస్థలకు సూచించింది.