ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్‌లో 158 ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేకుండా జాబ్..

ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్ట్‌లో 158 ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేకుండా జాబ్..

ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్​ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ (ఏఏఐసీఎల్ఏఎస్) సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . 

పోస్టు పేరు: సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్).

మొత్తం ఖాళీలు: 158. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ  నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్  అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీలు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 27 ఏళ్లు.  ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 18.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మహిళా అభ్యర్థులకు రూ.100. 

లాస్ట్ డేట్: జూన్ 8. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్ నెస్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.aaiclas.aeroను సందర్శించండి.