సిమ్‌ మార్చాల్సిన అవసరం లేదు... 5జీ ఫోన్‌ ఉంటే సరిపోతుంది

సిమ్‌ మార్చాల్సిన అవసరం లేదు... 5జీ ఫోన్‌ ఉంటే సరిపోతుంది

ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్,వారణాసి వంటి ఎనిమిది నగరాల్లో 5G ప్లస్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. దశలవారీగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. 5G ప్లస్ సేవలను పొందేందుకు సిమ్‌ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5జీ ఫోన్‌ ఉంటే సరిపోతుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న వేగం కంటే 20 నుంచి 30 రెట్ల అధిక వేగంతో ఈ సేవలను పొందవచ్చునని తెలిపింది.

5జీ ఫోన్లన్నీ ఎయిర్‌టెల్‌ 5జీకి సపోర్ట్‌ చేయకపోవచ్చని, దీనికి సంబంధించి మొబైల్‌ సంస్థలు OTA అప్‌డేట్‌ ఇవ్వాల్సి ఉంటుదని  ఎయిర్‌టెల్ తెలిపింది. ప్రస్తుతం Apple, Samsung, Xiaomi, Vivo, Oppo, Realme , OnePlus 5G  మొబైల్స్  లలో ఎయిర్‌టెల్  5G ప్లస్ సేవలకు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు దసరా పండగ సందర్భంగా అక్టోబర్‌ 5 నుంచి ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ట్రయల్‌ బేసిస్‌పై 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు జియో ప్రకటించింది.