
హైదరాబాద్ వెలుగు: ఇండియన్ రైల్వే సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఐఆర్ఎస్ఓసీ) కోసం సెక్యూరిటీ సర్వీసులను అందించడానికి ఎయిర్టెల్ బిజినెస్ మల్టీ-ఇయర్ కాంట్రాక్ట్‌ను గెలుచుకుంది. ఇండియన్ రైల్వే ఐటీ సిస్టమ్ను కాపాడటానికి ఇది గ్రీన్‌ఫీల్డ్, మల్టీలేయర్ సైబర్ సెక్యూరిటీ రక్షణ వ్యవస్థను డిజైన్, బిల్డ్, ఇంప్లిమెంట్, ఆపరేట్ చేస్తుంది.
రైల్వే సర్వీసుల ఎండ్–టు–ఎండ్ డిజిటల్ఆపరేషన్స్ను కూడా రక్షిస్తుంది. ఇందు కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన సైబర్‌సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను వాడుతామని తెలిపింది. కాంట్రాక్టు ఆర్థిక వివరాలను మాత్రం ఎయిర్టెల్బిజినెస్వెల్లడించలేదు.