
హైదరాబాద్, వెలుగు: టెలికం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన ఇంటర్నేషనల్ రోమింగ్ (ఐఆర్) ప్లాన్‌లలో మార్పులు చేసింది. 189 దేశాల్లో ఎంపిక చేసిన ప్లాన్లపై అపరిమిత డేటాను అందిస్తోంది. ఎక్కువ కాలం విదేశాల్లో ఉండే ఎన్నారైల కోసం ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రూ.4000 ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ విదేశాల్లో 5జీబీ డేటా, 100 నిమిషాల కాలింగ్‌ను అందిస్తుంది. మనదేశంలో ఉంటే రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఈ కొత్త ప్లాన్‌ల ద్వారా కస్టమర్లు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది లేని కనెక్టివిటీని పొందుతారని ఎయిర్టెల్తెలిపింది.