Airtel: ఎయిర్‌టెల్ మనీ ఐపీవోకి సన్నాహాలు.. రంగంలోకి దిగిన సిటీ గ్రూప్..

Airtel: ఎయిర్‌టెల్ మనీ ఐపీవోకి సన్నాహాలు.. రంగంలోకి దిగిన సిటీ గ్రూప్..

Airtel Money IPO: ఎయిర్‌టెల్ ఆఫ్రికా తన ఫిన్‌టెక్ ఆర్మ్ మొబైల్ మనీ యూనిట్ అయిన ఎయిర్‌టెల్ మనీ వ్యాపారాన్ని 2026లో ఐపీవోగా తీసుకురావాలనే ప్లాన్ ను అధికారికంగా ప్రకటించింది. దీంతో భారత టెలికాం దిగ్గజం అధినేత సునీల్ మిట్టల్.. ఈ ఐపీవో ఫ్లోటింగ్ కోసం ఇప్పటికే గ్లోబల్ బ్యాంక్ సిటీ గ్రూప్ ను అడ్వైజర్‌గా నియమించినట్లు తెలుస్తోంది. 

ఎయిర్‌టెల్ మనీ ప్రస్తుతం 45.8 మిలియన్ యూజర్లతో ఏడాదికి సుమారు162 బిలియన్ డాలర్లు విలువైన లావాదేవీలు నిర్వహిస్తోంది. ఇందులో TPG, మాస్టర్ కార్డ్, కతార్ మ్యునీల్ వెల్త్ ఫండ్ వంటి ప్రపంచ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. అప్పటి విలువ 2.65 బిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం ఈ ఫిన్ టెక్ యూనిట్ మార్కెట్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీనిని ప్రత్యేక కంపెనీగా 2026 మొదటి భాగంలో ఐపీఓను లండన్, యుఎఈ, ఇతర యూరోపియన్ స్టాక్ ఎక్స్చేంజుల్లో లిస్టింగ్ చేసే అంశాన్ని ఎయిర్‌టెల్ ఆఫ్రికా పరిశీలిస్తోంది. కంపెనీ దీని ద్వారా సేకరించే డబ్బును స్థానిక పోటీదారులైన Mpesa, MTN MoMoలతో పోటీ పడాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఈ ఐపీవో ద్వారా వచ్చిన నిధులను కంపెనీ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, కొత్త మార్కెట్లలోకి వ్యాపార విస్తరణ, కొత్త ఆవిష్కరణలకు వినియోగించనుంది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ద్వారా ఆఫ్రికాలో ఎక్కువ పేద ప్రజలకు డిజిటల్ ఫైనాన్స్ అందుబాటులోకి వస్తోంది. గతేడాది కంపెనీ ఆదాయం 20–22% పెరుగుదల నమోదు చేసింది. ఎయిర్ టెల్ తీసుకొస్తున్న ఐపీవో కోసం అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఫిన్ టెక్ యూనిట్ ఇప్పటికే 14 దేశాల్లో సర్వీసులు అందిస్తోంది. ఐపీవో విజయవంతమైతే.. ఆఫ్రికన్ ఫిన్‌టెక్ విప్లవాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లే అవకాశముందని తెలుస్తోంది.