Airtel ,Jio లలో 90 GB డేటా,60 రోజులు వ్యాలిడిటీ అందించే రీఛార్జ్ ఫ్లాన్ ఏదంటే..

Airtel ,Jio లలో  90 GB డేటా,60 రోజులు వ్యాలిడిటీ అందించే రీఛార్జ్ ఫ్లాన్ ఏదంటే..

ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ల రీచార్జ్ ప్లాన్ ఎంపిక చాలా కష్టతరంగా మారింది. టెలికాం ఆపరేటర్లు అనేక రకాల రీచార్జ్ ఫ్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోటీపోటీగా కొత్తకొత్త రీచార్జ్ ఫ్లాన్లను తీసుకొస్తున్నాయి. దీంతో సరసమైన బ్యాలెన్స్, బెనిఫిట్స్ ను ఎంచుకోవడం కీలకంగా మారింది. చాలా మంది కస్టమర్లు దీర్ఘకాలిక ప్లాన్లను రీచార్జ్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఎయిర్ టెల్, జియో కొన్ని రకాల లాంగ్ టర్మ్ ప్లాన్లను  తీసుకొచ్చాయి. వీటిలో ఏదీ కస్టమర్లకు లాభదాయకమైన రీచార్జ్  ప్లాన్లను అందిస్తున్నాయో.. వాటి ఫీచర్లను పోల్చుదాం.. 

Airtels  రూ. 519 ప్లాన్..

ఎయిర్ టెల్ 60 రోజుల వ్యాలిడిటీతో రూ. 519 రీచార్జ్ ప్లాన్ ను అందిస్తోంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100SMS...90GB  డేటాను అందిస్తోంది. అంటే రోజుకు 1.5GB డేటా  లభిస్తుంది. అంతేకాదు అదనంగా Apollo 24/7 cicle, Pre Hello tunes, రూ. 100 ఫాస్టాగ్ క్యాష్ బ్యాక్ ,కాంప్లిమెంటరీ Wynk  మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. 

Jio's రూ. 529 ప్లాన్.. 

జియో 56 రోజుల వ్యాలిడిటీతో రూ. 529 రీచార్జ్ ప్లాన్ ను పరిచయం చేసింది.ఇది కూడా రోజుకు 1.5 GB డేటాను అందిస్తుంది. అంటే మొత్తం గా 84GB డేటాను వస్తుంది. అంతేకాదు రోజూ 100  SMS  లు, అన్ని రకాల టెలికం నెట్ వర్క్ లకు ప్రీకాలింగ్ ను అందిస్తోంది. దీంతోపాటు జియో Saavn Pro సబ్ స్క్రిప్షన్, జియో Suite తో పాటు అన్ లిమిటెడ్ 5G డేటా యాక్సెస్ ఇస్తుంది. 

also read : ఈ స్మార్ట్ఫోన్ పై రూ.13వేల భారీ తగ్గింపు..డిటైల్స్ ఇవిగో

ఈ రెండు నెట్ వర్క్ లను పోల్చి చూస్తే.. రెండు రీచార్జ్ ప్లాన్లు ఒకే రకమైన డేటా, కాలింగ్ ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే ఎయిర్ టెల్ రూ. 519 ప్లాన్ మరింత సరసరమైనది, ఫీచర్ రిచ్ గా ఉంది. రూ. 10ల స్వల్ప ధర వ్యత్యాసం ఉన్నప్పటికీ ఎయర్ టెల్ అపోలో 24/7 సర్కిట్, ప్రీ హాలోటూన్స్, వింక్ మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్, ఫాస్టాగ్ క్యాష్ బ్యాక్ వంటి అదనపు ప్రోత్సాహకాలను కస్టమర్లకు అందిస్తుంది. ఇది కస్టమర్లకు మరింత లాభదాయకమై ఎంపిక అని చెప్పొచ్చు.