
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)అతిథి పాత్రలో కనిపిస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సలామ్. తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinikanth) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు ఐశ్వర్య. ఈ మూవీ లాస్ట్ డే ఇరవై రెండు గంటల పాటు(22hours) నాన్ స్టాప్ గా షూటింగ్ చేసినట్లు తెలుపుతూ నోట్ రిలీజ్ చేశారు.
ఈ సినిమా మొదటి, చివరి రోజుల్లో షూటింగ్ తమిళనాడులోని అరుణాచలంలో జరిగింది. చివరి రోజు ఇరవై రెండు గంటల పాటు నాన్ స్టాప్‌గా షూటింగ్ చేశాం. నాలుగు నెలల నుంచి మా టీమ్ అంతా ఎంతో కష్టపడింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. గతంలో కంటే ఎంతో తెలివిగా, ధైర్యంగా మారాను. షూటింగ్‌కు సహకరించిన ప్రతివారికి ధన్యవాదాలు..అంటూ ఐశ్వర్య రజనీకాంత్ నోట్ లో పేర్కొన్నారు. షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యినట్లు కూడా తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో ఆల్ ది బెస్ట్ చెబుతూ ఫ్యాన్స్ కామెంట్స్ తెలుపుతున్నారు. ఇక ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీ నుంచి రజినీ ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. రజినీ ముస్లిం గెటప్ లో కనిపిస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. నెల్సన్ దర్శకత్వంలో జైలర్ మూవీ రేపు (ఆగస్టు10న) రిలీజ్ కానుంది.