నైనీ కోల్బ్లాక్కు బలవంతంగా కార్మికులను పంపొద్దు : రాజ్ కుమార్

నైనీ కోల్బ్లాక్కు బలవంతంగా కార్మికులను పంపొద్దు : రాజ్ కుమార్

గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఆధ్వర్యంలో ఒడిశాలో నిర్వహిస్తున్న నైనీ కోల్​బ్లాక్ లో పని చేసేందుకు  కార్మికులు, ఉద్యోగులను బలవంతంగా పంపొద్దని ఏఐటీయూసీ (గుర్తింపు సంఘం) ప్రధాన కార్యదర్శి కె.రాజ్​కుమార్​కోరారు. గురువారం గోదావరిఖనిలోని భాస్కర్​రావు భవన్​లో జరిగిన మీటింగ్​లో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణిలోని క్లర్క్​లు, సెక్యూరిటీ గార్డులు, ఇతర వృత్తుల్లోని కార్మికులను నైనీ బ్లాక్​లో పనిచేయాలని యాజమాన్యం సర్క్యులర్​ జారీ చేసి ఒత్తిడి తెస్తుందని తెలిపారు. 

 ఇక్కడి కార్మికులు, ఉద్యోగులను బలవంతంగా పంపిస్తే అక్కడ భాష తెలియక, కుటుంబాన్ని తీసుకెళ్తే ఇబ్బందులు వస్తాయన్నారు. దీనిపై సింగరేణి పునరాలోచించి కేవలం ఒడిశా నైనీబ్లాక్ కోసమే ప్రత్యేక నోటిఫికేషన్​జారీ చేయాలని సూచించారు. అంతకుముందు జీడీకే ఓపెన్​కాస్ట్​ –5 ప్రాజెక్ట్​పై అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్వహించిన గేట్​ మీటింగ్​లో రాజ్​కుమార్ మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన  నాలుగు లేబర్​ కోడ్​లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ఈనెల 9న సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని సక్సెస్ చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల జేఏసీ నేతలు కె.సదానందం, మెండె శ్రీనివాస్, వడ్డెపల్లి శంకర్, కె.విశ్వనాథ్​, మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోశం, మదన మహేశ్​తదితరులు పాల్గొన్నారు.