AI technology shoes: ఏఐ టెక్నాలజీతో షూస్ తయారు చేసిన అజంతా

AI technology shoes: ఏఐ టెక్నాలజీతో షూస్ తయారు చేసిన అజంతా

ఈ మధ్య జనాలకి ఆరోగ్యంపై అవగాహన ఎక్కువై జిమ్, పార్కుల చుట్టూ తిరుగుతున్నారు. యోగా సెంటర్లకు వెళ్తున్నారు. దీంతో స్పోర్ట్ షూస్ కి బాగా డిమాండ్ పెరిగింది. ఖర్చుకు వెనకాడకుండా కంఫర్ట్, డ్యూరబిలిటీకి ప్రాధాన్యం ఇస్తూ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లని కొంటున్నారు. ఈ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని అంజంతా షూస్ కంపెనీ ఏఐ టెక్నాలజీతో స్మార్ట్ షూస్ తీసుకొచ్చింది. అవి ఎలా పనిచేస్తాయంటే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో పనిచేసే కొత్త తరం షూస్ ను అజంతా షూస్ తీసుకొచ్చింది. ఇంపాక్ట్ నావిగేటర్ పేరుతో పిలుస్తున్న ఈ స్మార్ట్ షూస్ అచ్చం స్మార్ట్ వాచ్ లాగా యూజర్ల అడుగులు, వారి వర్క్ అవుట్స్ ను ట్రాక్ చేయగలవు. అంతేకాకుండా ఈ షూస్ ద్వారా మ్యూజిక్ యాప్స్, వెబ్ సైట్స్ ను ఓపెన్ చేసుకోవచ్చు. అదెలాగంటే.. పాదాలను వివిధ రకాలుగా కదపడం ద్వారా ఇలా చేయొచ్చు. మాజీ ఇండియన్ క్రికెటర్ సౌరవ్ గంగూలి ఆధ్వర్యంలో ఈ షూస్ ను ప్రదర్శనకు ఉంచారు.