ఆ విమానం ఐదు సార్లు పేలింది.. నా కళ్ల ముందే ముక్కలు ముక్కలు అయ్యింది: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్లేన్ క్రాష్ ప్రత్యక్ష సాక్షులు

ఆ విమానం ఐదు సార్లు పేలింది.. నా కళ్ల ముందే ముక్కలు ముక్కలు అయ్యింది: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్లేన్ క్రాష్ ప్రత్యక్ష సాక్షులు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మరణవార్త దేశ వ్యాప్తంగ రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకు అందరినీ విషాదంలో ముంచేసింది. జిల్లా పరిషద్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్న క్రమంలో.. బుధవారం (జనవరి 28) మహారాష్ట్ర బారాముల్ల జిల్లాలో విమానం కూలిపోవడంతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో సహా ఐదు మంది చనిపోయారు. విమాన ప్రమాదాన్ని దగ్గర నుంచి చూసిన సాక్షలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 

విమనం రన్ వే పైకి వస్తున్న క్రమంలో.. విమానం దిగుతున్న తీరు చూసి పడిపోతుందా ఏంటా అని అనుకున్నాం. అనున్నట్లుగానే ఒక్కసారిగా రన్ వే పై పడిపోయింది. వంద ఫీట్ల పై నుంచి ఒక పక్కకు ఒరిగి విమానం పడిపోయింది. వెంటనే పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. వరుసగా నాలుగైదు పేలుళ్లు సంభవించాయి.. అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 

విమానం కూలిన వెంటనే దగ్గరకు వెళ్లి అందరినీ బయటకు లాగాలని అక్కడున్న వారందరం ప్రయత్నించాం. కానీ భారీగా మంటలు చెలరేగడంతో ఎలాంటి సహాయం చేయలేకపోయాం.. అని తెలిపారు.