తమిళ హీరో అజిత్ కుమార్ హీరోగా తమిళంలో 'తునీవు' సినిమా రూపొందింది. తెలుగులో ఈ సినిమాను 'తెగింపు' పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపైనే ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హెలికాప్టర్లు.. పవర్ బోట్లు.. ఛేజింగ్స్ తో సినిమాలోని భారీతనాన్ని చూపించారు.
ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి హెచ్.వినోత్ దర్శకత్వం వహించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో అజిత్ సరసన నాయికగా మంజూ వారియర్ కనిపించనుంది. తమిళనాట ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు.